ఖమ్మం బిషప్ ఉడుముల బాలరఘునాధపాలెం ఫిబ్రవరి 11 (జనం సాక్షి)మండలం చింతగుర్తి గ్రామం నందు నూతనంగా నిర్మించిన లూర్దుమాత దేవాలయం (ఆర్ సిఎం)చర్చిని ఖమ్మం మేత్రాసన పీఠాధిపతులు బిషప్ ఉడుముల బాల, డిడి ప్రతిష్టించి ప్రార్థనతో నూతన దేవాలయమును రిబ్బన్ కట్ చేసి చర్చిని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బిషప్ మాట్లాడుతూ క్రీస్తు బోధలు ప్రపంచ మానవాళికి ప్రేమా శాంతి సమాధానం అందరూ కలిగి ఉండాలని క్రీస్తు చూపిన మార్గంలో అందరు నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చింతగుర్తి గ్రామం నందు బిషప్ తో కలిసి పాల్గొన్న బిఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,సర్పంచ్ మెంటం రామారావు దంపతులు, మండల అధ్యక్షులు సుడా డైరెక్టర్ అజ్మీర వీరునాయక్,మంత్రి పిఎ చిరుమామిళ్ల రవి కిరణ్ పాల్గొని బిషప్ తండ్రి ఉడుముల బాల ను ఘనంగా సన్మానించారు, బిషప్ తండ్రి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అతిధులను శాలువాతో సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో
ఖమ్మం నేత్రాసన గురువులు లూర్ధుమాత దేవాలయ చర్చి ఫాదర్లు రఘునాధపాలెం మండలం ఫాదర్లు చింతగుర్తి ఆర్.సి.యం సంఘస్తులు గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




