ఊరుకొండ, జనవరి 18 (జనం సాక్షి):
ఊరుకొండ మండల జడ్పిటిసి సభ్యురాలు శాంత కుమారి రవీందర్ .. జడ్పీ చైర్ పర్సన్ గా నియామకం అయిన తర్వాత మొట్టమొదటి సారి ఊరుకొండ మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శుభ సందర్భంగా ఊరుకొండ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గువ్వ వరప్రసాద్, ఉపాధ్యక్షులు పయ్యావుల జంగయ్యలు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. రాజకీయ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని.. ఊరుకొండ మండల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆమెను కోరారు. కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జడ్పీ చైర్ పర్సన్ ను సన్మానించిన ఊరుకొండ ప్రెస్ క్లబ్..




