హైదరాబాద్, జనంసాక్షి: హైదరాబాద్ చిట్టీలపేరుతో ఓ వ్యక్తి రూ.3 కోట్ల మేరకు మోసానికి పాల్పడ్డారు. నాచారం బాబానగర్ ప్రాంతంలో నివచించే ఖలీల్‌పాషా స్థానికంగా చిట్టీలు నిర్వహిస్తున్నాడు. పలువురి వద్ద నుంచి చిట్టీల పేరుతో రూ.3 కోట్లు వసూలు చేశాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి 5 నుంచి పదివేల రూపాయల వరకు పాషా వసూలు
చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. వసూలు చేసిన 3 కోట్లతో రాత్రికి రాత్రే ఉడాయించాడు. విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులును ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసుకుని ఖలీల్ పాషా కోసం వెదుకుతున్నారు.




