చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టివేత
చిత్తూరు: జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల పోలీసులు దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందన్నాన్ని పట్టుకున్నారు. రేణిగుంట వద్ద వాహంనంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 80 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో గుడిపాల మండలం ఎన్‌ఆర్‌పేట చెక్‌పోస్టు తనిఖీలు చేపట్టి రూ. 50 లక్షలు విలువైన ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు.



