చెన్నై: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తమిళనాడులోని కడలూరులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లో తట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు సముద్రంలో చేపలవేటకు వెళ్లిన 18 మంది జిల్లా వాసులు గల్లంతయ్యారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించి ప్రభుత్వం పరిస్థితి సమీక్షిస్తోంది.




