వాషింగ్టన్: భీకర్ తుపాను ‘ సాండీ ‘ అమెరికాను వణికిస్తోంది. ఈ రోజు రాత్రికి న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో తుపాను తాకనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. న్యూయార్క్ నగరంలోని తీర ప్రాంతల నుంచి 3.75 లక్షల మందిని సురక్షిత ప్రాంతలకు తరలివెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశించారు. 76 ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రాలకు ప్రజలు తరలివెళ్తున్నారు. తుఫాన్ ప్రభావంతో న్యూయార్క్‌లోని అన్ని ప్రాంతాల్లో విద్యాసంస్థలను ముందస్తుగా మూసివేశారు. తూర్పు తీరుప్రాంతాల నుంచి 7,400 విమాన సర్వీసులను రద్దు చేశారు. రోడ్డు రవాణా పై కూడా తుపాన్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. వాషింగ్టస్. ఫిలిడేల్సియా, న్యూయార్క్‌లలో బస్సు, రైలు సర్వీసులను రద్దు చేశారు. కూడా తెరిచే అవకాశాలు లేవని మార్కెట్ అధికారులు వెల్లడించారు. 9/11 దాడుల తర్వాత స్టాక్‌మార్కెట్‌ను మూసివేయడం ఇదే మొదటిసారి.తుపాను నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని రడ్డు చేసుకొన్ని అధ్యక్షుడు ఒబామా అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షీస్తున్నారు.




