చిత్రాల్లో దీపావళి పాటలకు ప్రత్యేకత
విజయవాడ,నవంబర్13(జనంసాక్షి): దీపావళి ప్రత్యేకతను, దాని విశిష్టతను చెప్పడానికి అనేక సినిమాల్లో అనేక పాటలు వచ్చాయి. సినీ కవులు పాటల్లో దాని పరమార్థాన్ని ఇనుమడింపజేశారు. తెలుగునాట దీపావళిపై వచ్చిన పాటలు తక్కువే అయినప్పటికీ వాటి మహత్యం మాత్రం చిన్నపాటిది కాదు. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల కాలంలో వచ్చిన పాటల వైభవం ఇప్పటికీ ఏమాత్రం వన్నె తగ్గలేదు. ఇందుకు ఉదాహరణ.. విచిత్రబంధం సినిమాలో ఆచార్య ఆత్రేయ రాసిన ‘జీవితమే ఒక దీపావళి.. చీకటి వెలుగుల రంగేళీ’. ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని దీపావళి పాట ఇది. తరాలు మారుతున్నా ఆదరణ తగ్గని పాట అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాగే అనేక పాటలుఅనేక సినిమాల్లో దర్శనమిస్తాయి.