Tuesday, 3 November 2026

చిన్నారిపై టీచర్‌ లైంగిక వేధింపులు

7 copy
భగ్గుమన్న బెంగుళూరు

బెంగుళూరు,జనవరి7(జనంసాక్షి): బెంగుళూరులో మరో కీచక పర్వానికి తెరలేచింది. పాఠాలు చెప్పిన టీచరే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అభంశుభం తెలియని ఎనిమిదేళ్ల  చిన్నారిపై కృష్ణ అనే పాఠశాల ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన బెంగళూరులో జరిగింది.

ఎనిమిదేళ్ల బాలికపై లైంగికదాడికి యత్నించిన ఆ టీచర్‌కు దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులు,స్థానికులు పాఠశాలపై దాడి చేసి ఫర్నిచర్‌ను, వాహనాలను ధ్వంసం చేశారు. నిందితుడు బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో ఓ విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కస్టడీకి తరస్తుండగా ఆ బాలిక తల్లిదండ్రులు అడ్డుకొని కీచక ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేసి మరీ పోలీసులకు అప్పగించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయుడిని పట్టుకుని చితకబాదారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ పోలీసులను డిమాండ్‌ చేశారు. బెంగళూరులో ఇటీవలికాలంలో ఇలాంటి సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తుండడంతో స్థానికులు పలువురు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. అనంతరం పోలీసులు నిందితుడు కృష్ణను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఇలాంటి కీచకులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *