Thursday, 5 November 2026

చిన్న అడిశర్లపల్లి లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్

 

 

 

 

కొండమల్లేపల్లి ఏప్రిల్ 13 జనంసాక్షి న్యూస్ : మండల కేంద్రంలోని చిన్న అడిశర్లపల్లి లో గురువారం నాడు రైతు సేవా సహకార సంఘం కొండమల్లేపల్లి ఆధ్వర్యంలో దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ పిఎసిఎస్ చైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి తో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యపు ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని అన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల నుండి రైతు పండించిన ధాన్యాన్ని కొనము అని తెగేసి చెప్పినా వరి ధాన్యం పండించిన రైతులు నష్టపోకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని యాసంగి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోకూడదని చెప్పారు రైతులు తాలు,పొల్లు లేకుండా దాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే ప్రభుత్వ మద్దతు ధర ఇస్తుందని అన్నారు అనంతరం పిఎసిఎస్ చైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి మాట్లాడుతూ ఎ గ్రేట్ ధాన్యము ధర 2060, బి గ్రేడ్ ధాన్యము ధర 2040 అని తేమ 17 శాతం లోపు ఉన్న ధాన్యము మరియు తాలు లేకుండా ధాన్యం తేవలెను, భూమి పట్టా పుస్తకము, ఆధార్ కార్డు, బ్యాంకు పాసుబుక్కు పుస్తకము జిరాక్స్ తేవలెను, కొనుగోలు చేసిన ధాన్యము దిగుమతి అయ్యేవరకు రైతులేదే బాధ్యత అని, టార్బలిన్లు ఇచ్చు బాధ్యత కొనుగోలు కేంద్రాలకు లేదని, రైతు యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కు లింకు చేసుకొని ఉండాలని మరియు వ్యవసాయ అధికారి దగ్గర వరి పంట నమోదు చేసుకోవాలని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ సురేష్ పిఎసిఎస్ సెక్రటరీ పల్లా తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ బి. విష్ణుమూర్తి, డైరెక్టర్లు అమర్ సింగ్, తేలుకుంట్ల యాదగిరిరెడ్డి, గ్యార శ్రీను, గుండెబోయిన శ్రీనివాస్, సర్పంచ్ కేతావత్ విజయలక్ష్మి, మంగ్యా నాయక్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి, బిఆర్ఎస్ యువ నేత హిమవంత్ కుమార్, రమావత్ దస్రు నాయక్, శంకర్ నాయక్, బొడ్డు గోపాల్ గౌడ్, వస్కుల కృష్ణయ్య, సిద్ధూ, జాగృ బావోజీ, పిఎసిఎస్ కొప్పుల పాపిరెడ్డి, కొర్ర బాలకృష్ణ సిబ్బంది మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు