పెనుబల్లి, ఏప్రిల్ 13(జనం సాక్షి)ప్రజా సమస్యల పరిష్కారం,బీజేపీ కో హటావ్ దేశ్ కో బచావ్ నినాదం తో రాష్ట్రవ్యాప్తంగా ప్రజపొరు యాత్రను సీపీఐ నిర్వహిస్తున్నది. ఖమ్మం జిల్లా యాత్ర 14 వ తేదీన సత్తుపల్లి లో ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు వి ఎం బంజర కు చేరుకుంటుందని,అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడే సభ నిర్వహించి బోజన విరామం అనంతరం యాత్ర బృందం కల్లూరు, తల్లాడ,మీదుగా ఎన్కూర్ చేరుకుంటుందని సుధాకర్ తెలిపారు. పెనుబల్లి మండలం లోకి ప్రవేశించిన యాత్రకు మోటార్ సైకిళ్ళు తో స్వాగతం పలుకుతామని తెలిపారు,యాత్ర లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంత్,జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ తదితరులు పాల్గొంటారని సుధాకర్ తెలిపారు .ప్రజాపోరు యాత్ర జయప్రదానికి ప్రజలు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.




