Thursday, 5 November 2026

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంధాన్యం కొనుగోళ్ల విషయంలో ఆందోళన వద్దు ఆఖరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది ఎమ్మెల్యే భాస్కరరావు 

 

 

 

 

 

 

 

 

 

మిర్యాలగూడ, జనం సాక్షి  రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా  బారస పనిచేస్తుందని  మిర్యాలగూడ శాసనసభ్యులు నలుమోతు భాస్కర్ రావు అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న  ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో భాగంగా గురువారం నాడు మండల పరిధిలోని   దిలావర్పూర్, దామరచర్ల మండలంలోని   కెసిఆర్ కాలనీ లలో  ఐకెపి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పంట విక్రయాలకు సంబంధించి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆఖరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించనప్పటికీ  రాష్ట్ర ప్రభుత్వం  వెనుక తగ్గదని హామీ ఇచ్చారు. అదేవిధంగా వరి పంట మద్దత్తు ధర విషయంలో మిల్లర్ల నుండి ఎలాంటి సమస్య ఏర్పడకుండా చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. పొరుగు రాష్ట్రo నుండి ధాన్యం విక్రయాలకు  రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్  దుర్గంపూడి నారాయణరెడ్డి, ఎంపీపీ నూకల సరళ హనుమంత్ రెడ్డి, ఆంగోతు హతీరాం నాయక్, మండల రైతు మంది సమితి అధ్యక్షులు గడగొజు ఏడుకొండలు,మండల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, ఫాక్ట్ చైర్మన్ శానం ఆదిరెడ్డి, మాజీ డిసిసిబి డైరెక్టర్  రావూరి హన్యా నాయక్, మాజీ ఎంపీపీ ఒగ్గు జానయ్య, సర్పంచులు పోలేని నవ్య సైదులు, ధరావత్ యమున రాజసింగ్, ధరావత్ శారదా సైదా నాయక్, మూలవత్ రవీందర్ నాయక్, ఎంపిటిసి వీరనాయక్, మాజీ సర్పంచులు   సజ్జల శ్రీనివాస్ రెడ్డి , చిమట యాదగిరి, తుమ్మల ఫణి కుమార్, వాంకుడోతు సురేష్ నాయక్, లింగయ్య, వ్యవసాయ శాఖ అధికారులు, మిర్యాలగూడ ఎంపీడీవో జ్యోతిలక్ష్మి. గార్లపాటి, ఆయా గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.