Thursday, 5 November 2026

చిన్న ఆడిసర్లపల్లి గ్రామపంచాయతీ లో ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి సుడిగాలి పర్యటన

కొండమల్లేపల్లి జనవరి 19( జనంసాక్షి) న్యూస్ :
కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని చిన్న ఆడిసర్ల పల్లి గ్రామ పంచాయతీలో పర్యటించారు.ఎంపిపి దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి ఎంపిటిసి నిధులతో వేయించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులను స్థానికులతో కలిసి పర్యవెక్షించారు.అనంతరం గ్రామస్తులు గ్రామంలోని డ్రైనేజీ వ్యవస్థ సమస్యలను స్థానికులు ఎంపీపీ దృష్టికి తీసుకురావటంతో వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అందుకు సంభందించిన అధికారితో ప్రణాళిక తయారు చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.అనంతరం బృహత్ ప్రకృతి వనం దగ్గర లక్ష్మీ నగర్ కాలనీలో విద్యుత్ తీగలు క్రింద వ్రేలాడుతూ ప్రమాదానికి గురి ఆయ్యే అవకాశం ఉందని తెలపడంతో అప్పటికప్పుడు విద్యుత్ ఏఈ దేవోజీ గారిని పిలిపించి సమస్య పరిష్కరించాలని తెలపడంతో వెంటనే సమస్య పరిష్కరిస్తానని తెలిపారు.గత వారం త్రాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పడంతో పైపు లైన్ వేయించారు. అందుకు సంబందించిన పనులను పర్యవేక్షణ చేసారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మూడావత్ మంగ్య నాయక్,గుండాల రాజేష్,గుండాల ప్రశాంత్, వస్కుల కృష్ణ,పెద్దిశెట్టి మహేందర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.