Thursday, 5 November 2026

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

-తెలంగాణ ప్రభుత్వ పథకాలే ఇతర రాష్ట్రాలకు ఆదర్శం
– ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్ జనవరి 19 (జనం సాక్షి): రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ నియోజక వర్గ వ్యాప్తంగా గురువారం ప్రారంభించారు. హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని హుజూర్ నగర్, నేరేడుచర్ల, గరిడేపల్లి మండలంలోని పోనుగొడు గ్రామములోని కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ దేశం మొత్తము తెలంగాణ ప్రభుత్వ పథకాలను చూసి వారి వారి రాష్ట్రాలలో అమలు చేస్తున్నాయని, మంచి మంచి పథకాలలో కంటి వెలుగు కార్యక్రమము కూడా ఒకటని ప్రజల అవసరాలు ఏమిటో తెలుసుకొని వాటిన్నింటిని తీర్చే పధకాలను రూపొందిస్తున్న ఘనత ఒక్క సీఎం కేసీఆర్ దే అని అన్నారు. నేడు ఎంతో మంది చిన్న పిల్లలకి కంటి సమస్యలు దృష్టి లోపం ఉంటుందని కంటి వెలుగు ద్వార పిల్లలందరికీ పరీక్షలు నిర్వహించి వారికి కావలిసిన మందులు, అద్దాలు ఇస్తున్నారని అన్నారు. పెద్ద వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తూ కావలిసిన మందులు, అద్దాలు ఇస్తారని అన్నారు. 40 ఏళ్ళు దాటినా అందరికి రిడింగ్ సైట్ ఉంటుందని అవి కూడా కంటి వెలుగు కార్యక్రమములో ఉన్నాయని తెలియజేసారు.
ఈ కార్యక్రమములో మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, ఆర్డీవో వెంకారెడ్డి, పలువురు వార్డు కౌన్సిలర్లు, మండల వైద్యాధికారి డాక్టర్ పుష్పలత, క్యాంప్ ఇన్చార్జీలు గజ గంటి ప్రభాకర్, ఇందిరాల రామకృష్ణ, డాక్టర్ సుష్మ, డాక్టర్ సృజన, మల్లికా, జయంతి, ఆశా కార్యకర్తలు, ఆర్ పి లు, వి ఓ ఏ లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.