బెల్లంపల్లి, ఏప్రిల్ 7, (జనంసాక్షి )బడుగు బహీనవర్గాలకు అండగా నిలిస్తూ, అన్నా అంటే నేను ఉన్నా అని అండగా ఉంటూ, సమాజ సేవలో తనదైన శైలిలో ముద్ర వేస్తూ , సామాన్యులకు సైతం న్యాయ వ్యవస్థ ద్వారా అందరికీ తోడ్పుతున్న బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చిప్ప మనోహర్ న్యాయవాది అందరివాడు అని సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బెడ్డల విజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చిప్ప మనోహర్ స్వగృహంలో ఘనంగా సన్మానించారు. ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కావడం బెల్లంపల్లి పట్టణ అదృష్టం అని అన్నారు. కార్యక్రమంలో శివ తదితరులు పాల్గొన్నారు




