Wednesday, 4 November 2026

బ్రాహ్మణ సమాజ సేవా సంస్థ ఆధ్వర్యంలో  బీద బ్రాహ్మణుడు కిషోర్ కుమార్ కులకర్ణి అంతిమ సంస్కారం 

 

 

 

 

 

 

 

 

జహీరాబాద్ ఏప్రిల్ 7( జనంసాక్షి)  బ్రాహ్మణ సమాజ సేవా సంస్థ ఆధ్వర్యంలో జహీరాబాద్ లో గురువారం  మృతి చెందిన  బీద బ్రాహ్మణుడు కిషోర్ కుమార్ కులకర్ణి అంతిమ సంస్కారం బ్రాహ్మణ సమాజ సేవా సంస్థ జహీరాబాద్ ఆధ్వర్యంలోసంగారెడ్డి జిల్లా  అధ్యక్షులు సురేష్ జోషి  ఆజ్ఞానుసారం నిర్వహించడం జరిగింది. అని రాజుకుమార్ దేశ్పాండే తెలిపారు. సంగారెడ్డి లో జరిగిన ఉపనయన సంస్కార కార్యక్రమంలో కిషోర్ కులకర్ణి పాల్గొని నా యొక్క అంతిమ సంస్కారం రాజుకుమార్  దేశ్పండే బ్రాహ్మణ సమాజ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించాలని రాజకుమార్ దేష్పండే ను  ప్రార్థించారు మాట ప్రకారం ఆయన యొక్క అంతిమ కార్యక్రమాన్ని బ్రాహ్మణ సమాజం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ దేశ్పాండే బాలచందర్ జోషి సరస్వతి మంజుల పరమేశ్వరయ్య మురళి అయ్యర్ వివిధ స్కూల్లో ప్రధానోపాధ్యాయులు మరియు  మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ బోధన్ యశ్వంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.