Wednesday, 4 November 2026

చిరకాల కోరిక నెరవేర్చిన ప్రభుత్వం. – బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

బెల్లంపల్లి, ఏప్రిల్ 10, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణ ప్రజల చిరకాల కోరిక తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చిందని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్ లో ఏర్పాటు చేసిన సింగరేణి స్థలాలకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బెల్లంపల్లి ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప వారి ఇబ్బందులను ఎవ్వరూ పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తర్వాతనే బెల్లంపల్లి నియోజకవర్గం అన్ని రంగాల్లో అత్యద్భుతంగా అభివృద్ధి చెందిందని, ఈ సింగరేణి ఇండ్ల పట్టాల మంజూరు వెనుక కూడా కోల్ బెల్ట్ ఎమ్మెల్యేల కృషి ఎంతగానో ఉన్నదనిఅన్నారు. ఈ సింగరేణి ఇండ్ల పట్టాల మంజూరు ఆవశ్యకతను పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ను అనేకసార్లు వ్యక్తిగతంగా కలసి వివరించామని, నిరంతర కృషి ఫలితంగానే ఈరోజు ఈ ఇండ్ల పట్టాల మంజూరు కార్యక్రమం విజయవంతం అయ్యిందని తెలిపారు. అనంతరం జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పేదప్రజల కోసం పనిచేస్తున్న బీఆరెస్ ప్రభుత్వాన్ని మనమందరం గుర్తించాలని, బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల కోసం అనుక్షణం పరితపించే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యని నియోజకవర్గ ప్రజలందరూ ఆశీర్వదించి రానున్న ఎన్నికల్లో కూడా బెల్లంపల్లి ఎమ్మెల్యేగా దుర్గం చిన్నయ్యని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని కెసిఆర్ కు బహుమతిగా ఇవ్వాలని సూచించారు. ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సింగరేణి ఇండ్ల పట్టాలకై దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినందున బెల్లంపల్లి ప్రజలెవరూ బీజేపీ , కాంగ్రెస్ నాయకుల మోసపూరిత మాటలను విని మోసపోకుండా అర్హులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ శాశ్వత ఇండ్ల పట్టాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, బెల్లంపల్లి ఆర్డివో శ్యామల దేవి, తహసీల్దార్ కుమారస్వామి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆరెస్ నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.