బెల్లంపల్లి, ఏప్రిల్ 10, (జనంసాక్షి )తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ నీ అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని బిజెపి బెల్లంపల్లి అసెంబ్లీ ఇన్చార్జి కొయ్యల ఏమాజి అన్నారు. రాష్ట్రంలో బిజెపికి రోజు రోజుకూ ఆదరణ పెరుగతోంది అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 11,300 కోట్ల రూపాయలు కేటాయించారని, దీంతో రాష్ట్రo ఎంతో అభివద్ది చెందుతుందని కొయ్యల ఏమాజి అన్నారు. హైదరాబాద్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి మోడీకి కొయ్యల ఏమాజి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ సశక్తికరణ్ అభియాన్ లో భాగంగా సోమవారం నెన్నెల మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈసంధర్భంగా ఏమాజి మాట్లాడుతూ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీనీ అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అద్యక్షులు శైలేంద్ర సింగ్, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కేశవరెడ్డి, బిజెపి మండల ఉపాధ్యక్షులు సాంబమూర్తి గౌడ్, గట్టు రాజయ్య, సర్పంచ్ సుజాత శ్రీనివాస్, సీనియర్ నాయకులు దూది ప్రకాష్, శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.




