Wednesday, 4 November 2026

సమాజ సేవలో  లయన్స్ క్లబ్ ముందుండాలి పదవ.విద్యార్థులకు మజ్జిగ పంపిణి

 

 

 

దండేపల్లి.జనంసాక్షి ఏప్రిల్10   సమాజ సేవలో లయన్స్ క్లబ్ సభ్యులు ముందుండి సేవ కార్యక్రమాలు చేపట్టాలని దండేపల్లి ఎస్సై కుందారపు ప్రసాద్  కోరారు.దండేపల్లి మండల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దండేపల్లి మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్ష కేంద్రం వద్ద వేసవికాలం దృష్ట్యా సోమవారం వార్షిక పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థులకు స్థానిక ఎస్సై కుందారపు ప్రసాద్ చేతుల మీదుగా మజ్జిగ పంపిణి చేశారు. ఆయన మాట్లాడుతూ సంఘం సభ్యులు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అని అన్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లి దండ్రులు, ప్రయాణికులు, స్థానికు లకు కూడా ఉచితంగా మజ్జిగ పంపిణి చేశారు. కార్యక్రమం లో క్లబ్ అధ్యక్షుడు  జాబు సుగుణాకర్,   మాజీ అధ్యక్షుడు  అన్నం సత్యనా రాయణ,  కోశాధికారి మాదంశెట్టి  మల్లిఖార్జున్, సభ్యులు  పాత శ్రీనివాస్, ఎనగందుల సత్యం, కొత్త శ్రావణ్, స్థానిక యువజన సభ్యుడు గడికోప్పుల వినోద్ కుమార్, జక్కుల దిలీప్, హాజీమ్, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు శ్రీదేవిలు పాల్గొన్నారు.