జనం సాక్షి దుబ్బాక. వీధి వ్యాపారుల భరోసా నివ్వడంలో దేశంలో సిద్దిపేట ప్రథమ స్థానం
దేశం లో లక్ష జనాభా దాటిన 3వేల 300 మున్సిపాలిటి ల్లో అగ్రభాగాన నిలిచిన సిద్దిపేట..- తెలంగాణ రాష్ట్రంలో టాప్ 10 లో సిద్దిపేట ప్రథమ స్థానం..- రుణాలు పొందిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు , కృషి చేసిన అధికారులకు, మెప్మా సిబ్బంది కి అభినందనలు తెల్పిన మంత్రి హరీష్ రావుసిద్దిపేట అన్నింటి లో అగ్రభాగాన నిలుస్తున్నది.. ఈ రంగం అయిన..ఏ విభాగం అయిన దేశ రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా నిలుస్తున్నది అనడానికి మరో సారి సిద్దిపేట జాతీయ స్థాయిలో లో మెరిసింది..సిద్దిపేట లో చిరు వ్యాపారం, వీధి వ్యాపారం చేసే వారికి రుణాలు ఇవ్వడం లో దేశంలోనే సిద్దిపేట అగ్రస్థానంలో నిలిచింది.. వీది వ్యాపారం చేసే అభాగ్యులకు మంత్రి హరీష్ రావు గారు అండగా నిలిచి భరోసా నిచ్చారు.. సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తా లో ప్రత్యేక విధి విక్రయ వెండింగ్ జోన్ గా ఏర్పాటు చేసి దాదాపు 40 మంది విధి వ్యాపారుల సంక్షేమానికి తోడ్పాటును అందించారు.. అదేవిధంగా సిద్దిపేట లో విధి వ్యాపారుల కు రుణం అందించడం లో మంత్రి హరీష్ రావు గారు పలు మార్లు బ్యాంక్ అధికారులతో సమీక్ష లు నిర్వహించారు.. విధి వ్యాపారులకు అండగా నిలవాలని అందుకు బ్యాంక్ రుణాలు ఇవ్వడం లో జాప్యం చేయొద్దని చెప్పారు.. ఆ దిశగా బ్యాంక్ అధికారుల సహకారం తో సిద్దిపేట 6525 మంది రుణాలకు ధరఖాస్తు చేసుకోగా 5707 మందికి 10 వేల చొప్పున రుణ సాయం మంజూరు అయింది.. అదేవిధంగా ఇప్పటి వరకు 2వేల మందికి ఆహార భద్రత పై ప్రత్యేక శిక్షణ ఇప్పించి సర్టిఫికెట్ ఇవ్వడం తో పాటు , యూనిఫామ్ , గ్లౌస్ లు అందమేడం జరిగింది.. వీటి అన్నింటి లో దేశము లో లక్ష జనాభా కలిగిన మున్సిపాలిటిలో సిద్దిపేట మున్సిపాలిటి ప్రథమ స్థానంలో నిలిచింది.. తెలంగాణ రాష్ట్రంలో టాప్ పదిలో వరుసగా 10 మునిపాల్టీల్లో సిద్దిపేట మున్సిపాలిటిలి ప్రథమ స్థానంలో నిలిచింది…. ఢిల్లీలో జరిగిన మూడవ వార్షికోత్సవం లో ఈ ర్యాంక్ లను ప్రకటించారు.. ఈ సందర్భంగా విధి వ్యాపారులకు రుణ సాయం లో దేశము లో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిల్వగా.. అందులో 10 మున్సిపాల్టీలు తెలంగాణ రాష్ట్రం వే..అందులో సిద్ధిపేట ప్రథమ ర్యాంక్ సాదించింది..- సమిష్టి కృషి తో సాధ్యం..- విధి వ్యాపారులకు శుభాకాంక్షలు, కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు.వీధి వ్యాపారులకు రుణ సాయం అందించడం లో దేశంలో నే సిద్దిపేట పట్టణం అగ్రస్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు గారు అన్నారు.. వీధి వ్యాపారుల్లో ఎంతో ఆత్మవిశ్వాసం , భరోసా నిస్తుంది.. ఇదే స్ఫూర్తితో మరిన్ని రుణ సాయం అందించే దిశగా పని చేయాలని..ఈ సందర్భంగా వీధి వ్యాపారులకు శుభాకాంక్షలు , ఇందుకు కృషి చేసిన బ్యాంక్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు, మెప్మా సిబ్బంది కి మంత్రి హరీష్ రావు అభినందించారు..




