Tuesday, 3 November 2026

తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియమ్మకు కృతజ్ఞతలు

హుజూర్ నగర్ జూన్ 2 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలచే అభినందనలు అందుకుంటున్న మాజీ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో శుక్రవారం హుజూర్ నగర్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జునరావు అధ్యక్షతన ఆమె చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోనియా గాంధీ దయ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందన్నారు. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చుటకు ఆనాడు యూపీఐ చైర్ పర్సన్ హోదాలో తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించారన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఆమె చేసిన కృషికి నిదర్శనంగా కృతజ్ఞతా భావంతో తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరించాలన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం సకల జనుల సమ్మెలో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ ఎరగాని నాగన్న గౌడ్, పిసిసి ప్రతినిధి దొంగరి వెంకటేశ్వర్లు, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్, సీనియర్ నాయకులు బాచి మంచి గిరిబాబు, కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి జక్కుల మల్లయ్య, ఎడవల్లి వీరబాబు, నియోజకవర్గ మైనారిటీ వర్కింగ్ అధ్యక్షులు ఎస్కే సైదా, బూత్ కమిటీ అధ్యక్షులు బుల్లెద్దు జైలు, వల్లపు దాసు కృష్ణ, కోళ్ల పూడి యోహాన్, మేళ్లచెరువు ముక్కంటి, పోతనబోయిన రామ్మూర్తి, చింతకాయల రాము, సులువా చంద్రశేఖర్, పల్లపు వెంకటేశ్వర్లు, ఎస్ కే ఉద్దండు, పోతుల జ్ఞానయ్య, అంజనపల్లి సుదర్శన్, బొల్లెద్దు కార్తీక్, చిలకబత్తిని జయరాజు, దాసరి రాములు, పాలకూరి లాలు, తదితరులు పాల్గొన్నారు.