చివరికోర్కెలేదు జైలులోనే అంత్యక్రియలు
హైదరాబాద్: బుధవారం పూణేలోని ఎరవాడ జైలులో ఉరిశిక్షకు గురైన పాకిస్తాన్ తీవ్రవాది మహమ్మద్ అజ్మల్ కసబ్‌కు ఆ జైలు ఆవరణలోనే అంత్యక్రియలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ముంబాయిలో ఈ విషయాన్ని వెల్లడించారు. కసబ్ చివరి కోర్కె ఏదీ కోరలేదని తెలియజేశారు. మరణశిక్ష అమలు వివరాలను చవాన్ వెల్లడించారు. ఉరిశిక్ష అమలు చేయబోతున్నట్లు ఈ నెల 12న కసబ్‌కు తెలిపినట్లు చెప్పారు. నియమాల ప్రకారం పాకిస్తాన్‌లోని కసబ్ కుటుంబ సభ్యులకు ఈ సమాచారాన్ని పంపామని తెలియజేశారు.




