న్యూ ఇయర్ వేడుకలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
* సబ్-ఇన్స్పెక్టర్ బి.శీనివాస్
టేకులపల్లి, డిసెంబర్ 31( జనం సాక్షి ): న్యూ ఇయర్ వేడుకలను నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని టేకులపల్లి సబ్ ఇన్స్పెక్టర్ భూక్య శ్రీనివాస్ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఇల్లందు డిఎస్పి రమణమూర్తి సూచన మేరకు శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం మండల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.మద్యం సేవించి వాహనాలు నడిపినచో, రోడ్డుమీద డీజేలో సౌండ్ సిస్టములు పెట్టకూడదని ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ జరుపుకోవాలని,ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దు అని అన్నారు. రోడ్డు పై కేక్ కటింగ్, ఓపెన్ డ్రింకింగ్ చేయకూడదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బైక్ సైలెన్సర్ లు మార్చు కోవాలని,
ర్యాష్ డ్రైవింగ్, మైనర్ లు వాహనాలు నడపరాదని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా టేకులపల్లి మండల ప్రజలు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.




