రఘునాథ పాలెం ఏప్రిల్ (జనం సాక్షి)మృతులకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షలు, పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి హమీ.ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం చీమలపాడు అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.లక్షలు, క్షతగాత్రుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు.
ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. క్షతగాత్రులకు పూర్తి స్థాయి లో అన్ని విధాలుగా వైద్య చికిత్సలు అందిస్తామని ప్రకటించారు.




