మునిపల్లి, ఏప్రిల్ 12, జనంసాక్షి : మండలంలోని మల్లికార్జునపల్లి గ్రామంలో ఇటీవల రేషన్ డీలర్ గా నియామకం అయినా బేగరి మల్లేశం రేషన్ షాప్ ను సర్పంచ్ విమలమ్మ, ఉపసర్పంచ్ విట్టల్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం డీలర్ గా నియామకం అయినా మల్లేశంకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ రాజు, గ్రామస్తులు బుచ్చన్న, శ్రీకాంత్ గౌడ్, నర్సింలు, కుమార్, కృష్ణ, మల్లేశం, విష్ణు, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.




