చుడీదార్ గ్యాంగ్ కలకలం.. ఆడవారి వేషంలో వచ్చి చోరీలు
- గతంలో హైదరాబాదులో చెడ్డీ గ్యాంగ్ విజృంభణ
- నిక్కర్లు, బనియన్లు ధరించి దోపిడీలు
- అదే కోవలో ఇప్పుడు చుడీదార్లు ధరించి దొంగతనాలు
- ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని జెక్ కాలనీలో ఘటన
హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టైట్ నిక్కర్లు, బనియన్లు మాత్రమే ధరించి చోరీలకు పాల్పడడం ఈ ముఠా ప్రత్యేకత. ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ తరహాలోనే చుడీదార్ గ్యాంగులు బయల్దేరినట్టు అర్థమవుతోంది. అందుకు వీడియోనే నిదర్శనం.
సమాజంలో సరైన ఉపాధి అవకాశాలు, సంపాదించుకునే సరైన మార్గాలు లేనప్పుడు అరచాకాలు పెరిగిపోతుంటాయి. అక్రమ మార్గంలో ధనం సంపాదించేందుకు ప్రయత్నించే వారి సంఖ్య పెరిగిపోతుంది. కారణాలు ఏమైనప్పటికీ సమాజంలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. అంతేకాక వివిధ రకాల గ్యాంగ్ లు హల్ చల్ చేస్తూ జనాలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో చెడ్డి గ్యాంగ్ సృష్టించిన కలకం అంతాఇంతా కాదు. తాజాగా చుడీదార్ గ్యాంగ్ అనేది జనాలను కలవర పెడుతోంది.