హైదరాబాద్: సికింద్రాబాద్ పద్మారావునగర్‌లోని చెత్తకుప్పలో రెండు తుపాకులుదొరకడం కలకలం సృష్టించింది. గాంధీ ఆసుపత్రి వెనకభాగంలో ఉన్న చెత్తకుప్పలో తుపాకులు కన్పించాయని చెత్త ఏరేవారు పోలీసులకు సమాచారమందించారు. చిలకలగూడపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు 303 తుపాకులతోపాటు 20 తుటాలను స్వాధీనం చేసుకున్నారు. తుపాకులు ఎవరివి, ఇక్కడికి ఎలా వచ్చాయనేదానిపై దర్యాప్తు చేపట్టారు.




