అలంపూర్ జనంసాక్షి (జనవరి 26) అలంపూర్ మండల పరిధిలోని కోనేరు గ్రామంలో రైతు చిన్న కృష్ణయ్య నాయుడు చెరుకు పంట బుధవారం రాత్రి ప్రమాదవాశత్తు అగ్నికి ఆహుతి అయింది. విషయం తెలుసుకున్న బీఎస్పీ పార్టీ నాయకులు గురువారం కోనేరు గ్రామానికి వెళ్లి రైతుని పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ రాత్రి పగలు కష్టపడి పండించిన పంట అగ్నికి ఆహుతి కావడం చాలా బాదకరం అన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు . నష్టపోయిన రైతుకు వెంటనే 5లక్షల నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉండవల్లి మండల అధ్యక్షులు ప్రభుదాస్,కోనేరు సెక్టార్ అధ్యక్షులు మద్దిలేటి , అలంపూర్ మండలం సోషల్ మీడియా ఇంఛార్జి కడమడకల సురేష్ పాల్గొన్నారు.




