గోపాల్ పేట్ జనం సాక్షి జనవరి (26): గోపాల్ పేట్ గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న బాలరాజుకు జిల్లా ఉత్తమ పంచాయతీ కార్యదర్శి అవార్డును జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష చేతుల మీదుగా గురువారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు




