Wednesday, 4 November 2026

నెన్నెలలో ఘనంగా గణతంత్ర వేడుకలు. ఫొటో: జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న తహసీల్దార్.

 

 

 

నెన్నెల, జనవరి 26, (జనంసాక్షి )నెన్నెల మండలంలో గురువారం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ నాయకుల చిత్ర పటాలకు పూల మాలలు వేసి జాతీయ జెండా ఎగురవేశారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ భూమేశ్వర్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ రమాదేవి, ఎంపీడీఓ వరలక్ష్మి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ ఝాన్సీ, పోలీస్ స్టేషన్లో ఎస్సై రాజశేఖర్, అటవీ రేంజ్ కార్యాలయంలో రేంజర్ గోవింద్ చంద్ సర్దార్, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మేనేజర్ రాజారాం, సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ మేకల మల్లేష్, జిల్లా పరిషత్ హైస్కూల్ లో హెచ్ఎం నారాయణ, నెన్నెల గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తోట సుజాత, ఎంపీటీసీ పురంశెట్టి తిరుపతి, మండల కో అప్షన్ సభ్యుడు ఇబ్రహీం, నాయకులు పంజాల విద్యా సాగర్ గౌడ్, సంతోషం ప్రతాప్ రెడ్డి, సింగతి రాంచందర్, తదితరులు పాల్గొన్నారు.