Tuesday, 3 November 2026

ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి

సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి):ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని అఖిల భారతీయ అయప్ప ధర్మ ప్రచార సభ జిల్లా అధ్యక్షులు రంగు ముత్యంరాజు, ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాస్ అన్నారు.సోమవారం అయ్యప్ప స్వామి వారి జన్మనక్షత్రమైన ఉత్తర నక్షత్రంను పురస్కరించుకునిఆ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద పెరుగన్నం, పులిహోర పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం అయ్యప్పస్వామి మణికంఠ స్వామిగా అవతరించారని అన్నారు.ఉత్తర నక్షత్రంలో అయ్యప్ప స్వామి వారు జన్మించారు కావున ప్రతి ఏడాది ఈ రోజున స్వామి వారి జన్మదినం నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావం అలవర్చుకొని సన్మార్గంలో పయనిస్తూ స్వామి అనుగ్రహం పొందాలని కోరారు.భక్తుల సహకారంతో అన్నదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘ జాతీయ కార్యదర్శి వంకాయలపాటి శంకర్, పిఆర్ఓ రాపర్తి మహేష్ కుమార్, కోశాధికారి మాశెట్టి నరేష్ , కమాండెంట్ సుంకాని శ్రీనివాస్,,జిల్లా కార్యవర్గ సభ్యులు దూలం నగేష్, సిద్ధప్ప ,మొరిశెట్టి సత్యనారాయణ, తల్లాడ రాము, నిమ్మల శ్రీనివాస్, రాఘవ శెట్టి ,చిత్తలూరి శ్రీనివాస్ స్వామి ,రాచకొండ శ్రీనివాస్, తూడి మధు తదితరులు పాల్గొన్నారు.