చెరువులో మునిగి బాలుడి మృతి
నెల్లూరు,జూన్20(జనం సాక్షి ): ప్రమాదవశాత్తు తడ మండలం చెనుగుంట చెరువులో పడి ఎనిమిదేళ్ల బాలుడు గౌతమ్ ప్రాణాలు కోల్పోయాడు. తన తల్లి మునమ్మ బట్టలు ఉతికేందుకు చెరువుకు వెళ్తుండగా గౌతమ్ కూడా వెళ్లాడు. అదే సమయంలో అదే గ్రామానికి చెందిన శ్రావణి రావటంతో ఇద్దరు కలిసి చెరువులో దిగారు. కొంచెం లోతుకి వెళ్లడంతో మునిగిపోతుండగా మునమ్మ కేకలు వేసింది. ఆ కేకలు విన్నస్థానికులు వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలిస్తుండగా గౌతమ్ చనిపోయాడు. బాలికను వైద్యులు కాపాడగలిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.