చెల్లెలి సాయం తీసుకోవడంలో తప్పులేదు

ప్రియాంక అరంగేట్రంపై

న్యూఢిల్లీ,జనవరి24(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ తూర్పు ఉత్తర ప్రదేశ్‌ ఇన్‌ఛార్జిగా నియమితురాలైన ప్రియాంక గాంధీపై లోక్‌సభ స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ ప్రశంసల జల్లు కురిపించారు. గురువారం ఆమె మాట్లాడుతూ ప్రియాంక గాంధీ చాలా మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురించి మాట్లాడుతూ ఆయన తాను ఒక్కడినే రాజకీయాలు చేయలేనని అంగీకరించారని, అందుకే ఆయన తన సోదరి ప్రియాంక సహాయం తీసుకుంటున్నారని అన్నారు. ఇది మంచి విషయమేనని చెప్పారు. సహాయం తసీఉకోవడంలో తప్పు లేదన్నారు. ప్రియాంక గాంధీ వాద్రాను తూర్పు ఉత్తర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జిగా రాహుల్‌ గాంధీ బుధవారం నియమించారు. ఆమె లోక్‌సభ ఎన్నికల వరకు మాత్రమే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారని అనుకోవద్దని, రెండు నెలల కోసం మాత్రమే ఆమె వచ్చారనుకోవద్దని ఆయన చెప్పారు. తన సోదరి ప్రియాంక చాలా సమర్థురాలని కూడా చెప్పారు.