బూర్గంపహాడ్ ఏప్రిల్ 21 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో తెలంగాణ ఐకెపి వివోఏ ల సంఘం సి ఐ టి యు ఆద్వర్యంలో రాష్ట్రవ్యాప్త సమ్మె లో భాగంగా వి ఒ ఎ ల న్యాయమైన కోరికలు తీర్చాలని సమ్మె ఐదవ రోజు వి ఒ ఎ లు చెవిలో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఐకెపి వివోఏలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్పు గా గుర్తింపు వచ్చేలాగా ఈరోజున ముందంజలో ఉంచింది వివోఏ లేనని వారన్నారు. కష్టానికి తగ్గ ఫలితం లేదని వారు వాపోయారు. వీవోఏ లకు 26,000 వేల గౌరవ వేతనం, పీఆర్సి అమలు చేయాలని, వీవోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రమాద భీమా 20 లక్షలు చెల్లించాలని, ఆరోగ్య భీమా 10 లక్షలు కల్పించాలని, అర్హులైన విఒఏ లను సిసిలుగా ప్రమోషన్ కల్పించాలి. వీవోఏలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ట్యాబులు ఇవ్వాలని, ఆన్లైన్ రిపోర్ట్ లు చేయమని, గ్రేడింగ్ పద్ధతిని రద్దు చేయాలని, వివోఏ జీతాలు వివోఏ ల ఎకౌంట్లోనే వేయాలని, అభయ హస్తం డబ్బులు పొదుపు సంఘాలకు ఇవ్వాలని, అర్హులైన వివోఏలను సీసీలుగా ప్రమోషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. విఒఎ ల సమ్మెకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, సి ఐ టి యు మండల కన్వెనర్ బర్ల తిరుపతయ్య సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వి ఒ ఎ ల మండల అధ్యక్షురాలు ఎన్ శ్రీలక్ష్మీ, ఉపాధ్యక్షురాలు పద్మావతి, కార్యదర్సులు కామాల్బీ, వసంత, కశాధికారి పోశమ్మ, పాపారావు మండలంలోని 62 మంది ఐకెపి విఒఎ ల సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు




