Wednesday, 4 November 2026

23న గురుకుల 5వతరగతి ప్రవేశ పరీక్ష

 

 

 

 

 

 

 

 

జుక్కల్, ఎప్రిల్ 21, (జనంసాక్షి),కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గం లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల పెద్ద కొడప్గల్ లో 2023 – 24 విద్యా సంవత్సరానికి 5వ తరగతి సీట్ల భర్తీకి అభ్యర్థులకు ఈ నెల ఏప్రిల్ 23 న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని శుక్రవారం పత్రికాప్రకటనలో ప్రిన్సిపాల్ టీ నళిని తెలిపారు.అభ్యర్థులు హాల్ టికెట్ లో తక్కడపల్లి అని ముద్రించబడింది కాని ఎగ్జామ్ మాత్రం పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో లో ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు.హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి website www. VTG cet ను సందర్శించాలని ప్రిన్సిపాల్ సూచించారు.