సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): చెస్ పోటీలు విద్యార్థులలో మేధా శక్తిని పెంచుతాయని, వారిలో ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను పెంచుతాయని సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం అన్నారు.సూర్యాపేట జిల్లా చెస్ అసొసియేషన్ ఆద్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ వారి సహకారంతో జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో టిజోలా చెన్ చాంపియన్‌షిప్ 2023 తెలంగాణ గురుకులమ్స్‌ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ సెలెక్షన్స్ అండర్ 15 బాలబాలికలకు నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల స్థాయి చెస్ పోటీలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.జిల్లా కేంద్రంలో విద్యార్దులకు చెస్ పోటీలు నిర్వహిస్తున్న జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులుగండూరి కృపాకర్ ను అభినందించారు.ఈ పోటీల విజేతలకు కప్స్, సర్టిఫికేట్స్ అందజేశారు.ఈ నెల 26న హైద్రాబాద్‌లో జరిగే ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌కు క్రీడాకారులను ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో చెస్ పోటీల నిర్వహకులు,విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.




