Wednesday, 4 November 2026

సీఎంఆర్​ఎఫ్​ చెక్కు అందజేసిన ఎంపీటీసీ, మాజీ

 

 

 

 

 

 

మునిపల్లి, జనం సాక్షి: అందోల్​ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్​ ఆదేశాల మేరకు ఆదివారంనాడు మండలంలోని బుసారెడ్డిపల్లి గ్రామానికి చెందిన దొడ్ల బాగయ్యకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. ఒక లక్ష చెక్కును లబ్దిదారుడికి మల్లికార్జునపల్లి ఎంపీటీసీ ఉల్లగడ్డల శివకుమార్​, మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ మండల సీనియర్​ నాయకుడు హస్నాబాద్ వెంకట్రాములు ఆదివారం నాడు గ్రామంలో అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరమని పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్​ పథకాన్ని అర్హులైనవారందరూ సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సాబ ప్రభు, పడమటి కుమార్, లాడే అడివయ్య, వెంకట్ రాములు, నేరెడిగుంట శంకర్, పట్లోళ్ల సంగమేశ్వర్, ఉప్పు మల్లికార్జున్, పడమటి సంతోష్, సాబ మల్లేశం, ఎండి శంషోద్దీన్, సాబ శివుడు, సంటయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.