దేవరుప్పుల ,మే01(జనం సాక్షి) ఐకేపీ సెంటర్ లో వరిధాన్యం బూడిద పాలాయిన ఘటన దేవరుప్పుల మండలంలో చోటు చేసుకుంది.ఆదివారం నాడు కురిసిన ఎదురు గాలులతో కూడిన భారీ వర్షానికి వరి ధాన్యం నిటా మునిగాయి.వరి ధాన్యాన్ని ఎండ బెట్టి,ఆరబోసి అమ్ముకుందమనుకున్న సమయంలోనే ఈ చెడ గొట్టు వాన వచ్చి ఆగమాగం చేసి రైతులను నష్టాల పాలు చేసి ఏడ్చేలా చేసింది. తాలు పేరుతో,మట్టి ఉందన్న సాకుతో,ధాన్యం ఆరాలేదన్నా వంకతో దళారులు రైతుల మోసం చేస్తున్నారు.రైతుల కోసం పనిచేస్తాం రైతులను ఆదుకుంటామని అన్న ప్రభుత్వం కొత్త సచివాలయం మీద ఉన్న సోయి రైతుల ధాన్యం కొనుగోలు పై ఉంటే బాగుండేదని రైతులు ప్రభుత్వం పై మండి పడుతున్నారు.రానున్న మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతుంది.ఈ వర్షమే వస్తే ఉన్న వరి ధాన్యం పూర్తిగా నీళ్లలో కొట్టుకోపోయే అవకాశం ఉందని వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చెయ్యాలని రైతులు డిమైండ్ చేస్తున్నారు.




