చేనేత ఉత్పత్తుల పై 5 శాతం జి యస్ టి రద్దు చెయ్యాలి
పంథాకాని శ్రీనివాస్
మహదేవపూర్ అక్టోబర్ 30 ( జనంసాక్షి )
మహదేవపూర్ మండల నాయకులు పంథాకాని శ్రీనివాస్ పత్రిక ప్రకటన ద్వారా కేంద్ర ప్రభుత్వం పలు విమర్శలు గుప్పించారు కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జి యస్ టి ని రద్దు చెయ్యాలని. తెలంగాణ రాష్ట్ర పురపాలక చేనేత జౌళి శాఖ మంత్రి కే టి ఆర్ పిలువు మేరకు లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం .పై పోరాటానికి సిద్ధం కావాలని అలాగే చేనేత ఉత్పత్తుల పై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 జి యస్ టి వెంటనే రద్దు చేయాలని . చేనేత కార్మికులు కోరారు చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెరిగేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని. డిమాండ్ చేశారు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విదంగా చేనేత ఉత్పత్తుల పై .పన్ను వేయడం దుర్మార్గమైన చర్యగా బావిస్తునం. భారత దేశంలో వ్యాపార రంగం తరువాత ఎక్కువ మంది. చేనేత రంగం పై ఆధారపడి జీవిస్తున్నారని అలాంటి రంగాన్ని అభివృద్ధి చెయ్యాలి కానీ పన్ను వేసి ఇబ్బందులకు గురి చేయడం సరికాదు పంథాకాని శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వం పై విమర్శించారు




