చేనేత వారసత్వ సంపదను కాపాడుకోవాలి నేటి నుంచే చేనేత భీమా : ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 7 : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని కృష్ణవేణి చౌరస్తా లో చేనేత జౌళి శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత ర్యాలి ని జెండా ఊపి ప్రారంభించి చేనేత కార్మికులతో కలిసి జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య పాతబస్టాండ్ మీదుగా బాల భవన్ వరకు ర్యాలిలో పాల్గొన్నారు.
ఆదివారం గద్వాల పట్టణంలోని బాలభావన్ లో జాతీయ చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా జౌళి శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్తానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తో కలిసి పాల్గొని మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా చేనేత చీరల కళా నైపుణ్యం భారతదేశం మొత్తంలో అభివృధి చెందిందని,చేనేత చీరలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. చేనేత వారసత్వ సంపదను కాపాడుకోవాలని, చేనేత కార్మికులకు వచ్చే అన్ని సంక్షేమ పథకాలను మరియు అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చేనేత వస్త్రాల వల్ల ఆరోగ్యం వస్తుందని, చర్మ వ్యాధులు రావని, అంతేకాక శరీరాన్ని చల్లగా ఉంచుతాయని అందువల్ల ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి చేనేత రంగాన్ని,కార్మికులను కాపాడాలని, చేనేతలకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. చేనేత పరిశ్రమ పై ఆధారపడిన వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రారంభించిందని, ఇంకా ముందు ముందు చేనేత కార్మికులను ఆదుకోవడానికి అన్ని రకాల సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. మీ అందరి కృషి వల్లే చేనేత చీరలకు మంచి పేరు వచ్చిందని, జిల్లా లోని నేతన్నలకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అందించి ముందుకు తీసుకెళ్ళేవిదంగా కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించాలని కోరుతూ కార్యక్రమానికి హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు .
జిల్లా శాశనసభ్యులు కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ,జాతీయ చేనేత దినోత్సవం స్వాతంత్య్ర సమపార్జనకు ఒక సాధనంగా చేనేత నిలిచిందని అన్నారు. చేనేత కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేతన్నకు చేయూత పథకం తీసుకువచిందని 59 సం వచ్చి నేతన్న అకాల మరణం చెందితే , పది రోజులలో 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తునదని, ఈ పథకాన్ని మంత్ర్హివార్యులు కె టి ఆర్ గారు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రపంచం లోనే చేనేత చీరలకు ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. తదనంతరం చేనేత వృత్తి లో నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులకు ప్రశంసా పత్రాలతో పాటు , మొమెంటో శాలువా ల తో సన్మానించారు. వ్యాస రచన పోటీలలో విజేతలైన విద్యార్థులకు ప్రశంసా పత్రం, మొమెంటో లతో సత్కరించారు. రాజోలి చేనేత సహకార సంఘానికి రూ. 11.43, లక్షలు, నేతన్నకు చేయూత స్కీం కింద 1,13,06,200 లక్షల పావలా వడ్డీ డమ్మీ చెక్కును అందజేశారు. కార్మికులు నేసిన చేనేత వస్త్రా ల స్టాళ్ళ ను ప్రారంబించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మెన్ రామేశ్వరమ్మ, జిల్లా చేనేత మరియు జౌళి శాఖ ఎ.డి గోవిందయ్య, డి పి ఆర్ ఓ చెన్నమ్మ, జాడ్ పి టిసి రాజశేఖర్, ఎం పి పి విజయ కుమార్, కౌన్సిలర్ లు నాగిరెడ్డి, వెంకట్రాములు, రాధా, చేనేత అభివృది అధికారులు చేనేత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.




