Tuesday, 3 November 2026

చేవెళ్ల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

 చేవెళ్ల జూన్ 02 (జనం సాక్షి) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించిన మండల ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి. ఈ సందర్భంగా అనంత్ రెడ్డి మాట్లాడుతూ…తెలంగాణ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని తెలంగాణ సమాజం అందుకోసం వేచి చూస్తున్నారని రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎందరో ఉద్యమ కారుల త్యాగాలు, అమరుల ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పాటుకు కొందరు ఆంధ్ర నాయకులు తప్ప యావత్ భారతావని పులకించింది కానీ ప్రస్తుత పరిస్థితులు తెలంగాణ ఏర్పాటునే ప్రశ్నించే విదంగా కుటుంబ కబందస్తలలో బందీ అయ్యింది. దొర కుటుంబ కోటలకు బీటలు వారితే తప్ప అమరుల ఆత్మకు శాంతి లేదు,ఉద్యమకారుల ఉద్యమానికి విలువ లేదు. చలో రండి మరోమారు తెలంగాణలో ఉద్యమిద్దాం కుటుంబ చెరసాలలో బందీ అయిన తెలంగాణకు విముక్తి కలిపిద్దాం. అని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా మండల అధ్యక్షులు అశోక్, మండల ఉపాధ్యక్షులు కృష్ణగౌడ్, శర్వలింగం. బీజేవైఎం పట్టణ అధ్యక్షులు బండారి శేఖర్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి మధుకర్ రెడ్డి, భాస్కర్ బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు అభిలాష్ బాబు, బీజేవైఎం మండల జాయింట్ సెక్రెటరీ బాల్ రెడ్డి, బిజెపి మండల నాయకులు కృష్ణ గౌడ్, సిహెచ్ శ్రీనివాస్, మల్లేశ్, బీజేవైఎం మండల నాయకులు జయసింహారెడ్డి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.