బై0సా. రూరల్ ఏప్రిల్ 11జనం సాక్షినిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఫ్లెక్సీలు,ఓపి స్లిప్ లలో ప్రత్యేక స్పెషలిస్ట్లు కలరని రాసుకొచ్చి వుండగా… చర్మ సమస్యతో బాధపడుతున్న ఓ యువకుడు ఓపికౌంటర్ కెళ్ళి సంబంధిత స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారని అడగగా అక్కడ సిబ్బంది ఆవునని సమాధానం ఇవ్వగా… డబ్బులు చెల్లించి, ఓపి స్లిప్ తీసుకొని లొపల డాక్టర్ తో తన చర్మ సమస్యల గురించి డాక్టర్ తో చర్చించారు. తీరా చూస్తే… సంబంధిత వైద్యానికి సంబంధించి స్పెషలిస్టు ఆ పని వేళలో అక్కడ లేడు. సాధారణంగా బి.ఎం.ఎల్.టి, బి.ఈ.ఎమ్.ఎస్…. లాంటి కోర్సు చేసిన డాక్టర్ అక్కడ ఎంబిబిఎస్ స్పెషలిస్ట్ చేసే వైద్యాన్ని చేస్తున్నాడని యువకుడు గమనించాడు. సదురు డాక్టర్ పేరు అడగగా రాజు అని సమాధానం ఇచ్చాడు. మామూలుగా రాజేష్ డాక్టర్ కావచ్చు షార్ట్ నేమ్ గా రాజు అంటారని అనుకున్న ఆ యువకుడు,మళ్ళీ పూర్తి పేరు అడిగారు ధనరాజ్ గా సమాధానం తెలిపారు. అదేంటి సార్…!ఇక్కడ స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ కదా అని అడగగా… అవును సార్ ఇప్పుడు అందుబాటులో లేరు. డాక్టర్ రాజేష్ వీక్లీ లేదా మంత్లీ టైమ్స్ లో విజిట్ చేస్తారని, ప్రస్తుతం చర్మ సంబంధిత వ్యాధులకు నేనే చూస్తున్నానని ధనరాజ్ సమాధానం తెలిపాడు.దీంతో ప్రత్యేకంగా స్పెషలిస్ట్ వద్దే తమ చర్మ సమస్యలను తెలిపి సమస్యలకు సాధన దొరుకుతుందని వస్తే ఇక్కడ మాత్రం ఓ.పి స్లీప్లో, ఫ్లెక్సీలలో ఒక పేరు.? లోపల వైద్యం చేసేది ఇంకొకరా..!అంటూ ఆ యువకుడు మండిపడ్డారు. దీనికి సమాధానంగా ధనరాజ్ నేను రాజేష్ అని మీతో చెప్పలేదు రాజుననే చెప్పాను. అంటూ ఓపి లో ఉన్న సిస్టర్స్, వార్డ్ బాయ్స్ తప్పుగా చెప్పినట్లున్నారని సమాధానం ఇచ్చి మేళ్ళగా జారుకుందామనుకున్నారు. ఎంబీబీఎస్ వైద్యుల్ల బిల్డప్ ఇచ్చి చర్మానికి సంబంధించిన స్పెషలిస్ట్ అని తెలిపి,దానికి తగ్గలాగే మెడిసిన్స్ రాయడం ట్రీట్మెంట్ కి సంబంధించి వివరాలు తెలపడం ముమ్మాటికి తప్పేనని ఆ యువకుడు ధనరాజ్ తో వాదించాడు. కనీసం పాంప్లేంట్లో నువ్వు రాసుకున్న కోర్సులకి సర్టిఫికెట్ వుందా..అని సదరు యువకుడు ప్రశ్నించగా, కోర్స్ అయితే అయింది గానీ ప్రస్తుతం సర్టిఫికెట్ లేద0టూ… సర్టిఫికెట్ రావడానికి టైం పడుతుంది అంటూ సమాధానం ఇచ్చాడు.ఇదంతా ప్రజలు గమనించి తన హాస్పిటల్ ఇమేజ్ డామేజ్ అవుతుందేమోనని ధన్రాజ్ నన్ను బెదిరిస్తున్నారంటూ కొత్త పన్నాగంవేసే పనిని కప్పుకున్నాడు. సదరు ఇక్కడ పనిచేసే డాక్టర్స్ నంబర్స్ ఇవ్వండి అని అడగగా, మేం డాక్టర్స్ నంబర్స్ ఇవ్వమంటూ ధన్రాజ్ తెలిపగా…డాక్టర్ నంబర్స్ ఇవ్వకపోవడంతో అసలు ఇక్కడ సంబంధిత స్పెషలిస్ట్ డాక్టర్ కచ్చితంగా ఉన్నారా..! లేక అన్ని రకాల జబ్బులకి ధనరాజు ట్రీట్మెంట్ చేస్తున్నారా..! అని పలు అనుమానాలకి తావుస్తుంది.
సంబంధిత సర్టిఫికెట్లు ఇప్పటికి లేవాయే..!
హాస్పిటల్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఇప్పటికీ లేవాయే..! తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ కలిగి ఉందని, అప్లై చేసి దాదాపు సంవత్సరం పైనే గడిచిన పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఇంకా రాలేదని..! సదర్ డాక్టర్ తెలపగా ఇది గమనించిన పలువురు రిజిస్ట్రేషన్ లేని హాస్పిటల్ ఇప్పటికి ఎలా చలామణి అవుతుందని పైగా ఇప్పటికే దాదాపు 50 కి పైగే సర్జరీలు జరగగా రిజిస్ట్రేషన్ లేని హాస్పిటల్ లో సర్జలు జరపవచ్చా అని ప్రజలలో అనుమానం మొదలైంది..!
అధికారులు అసలు ఏం చేస్తున్నట్లు
సంబంధిత అధికారులు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ కాకుండా టెంపర్వరి రిజిస్ట్రేషన్ లతో కొనసాగుతున్న హాస్పిటల్ వైపు సంబంధిత అధికారులు ఎందుకు నిఘాఉంచడం లేదంటూ సామాన్య ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. కనీస అర్హతలు ఉన్న డాక్టర్లు వైద్యం చేయాల్సి ఉండగా సామాన్యi రకంగా ప్రధమ చికిత్సలు చేయాల్సిన డాక్టర్ ఎంబీబీఎస్ ట్రీట్మెంట్ చేయడంపై అధికారులకు ఇది కనబడడం లేదా అంటూ మండిపడుతున్నారు.
భయపడ్డ డాక్టర్ వెంటనే ఫ్లెక్సీ లకి ఆర్డర్
ఇప్పుడున్న సంబంధిత ప్లెక్సీల స్థానంలో ప్రధమ చికిత్స వైద్య నిపుణుడు ధనరాజ్ అంటూ… ఫ్లెక్సీలను చేపించే దిశగా అడుగులు వేసే పనిలో పడ్డరు. ఇన్ని రోజులు ప్రముఖ డాక్టర్ పేరు వు0చి యువకుడు ప్రశ్నించిన తీరును గమనించి వెంటనే కొత్త ఫ్లెక్సీలకు ఆర్డర్ ఇవ్వడం పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
హాస్పిటల్స్ కి రిజిస్ట్రేషన్స్ తప్పనిసరిడి.ఎం.ఏఛ్.ఓ ధన్రాజ్.
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ ఆసుపత్రిలకి రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని రిజిస్ట్రేషన్ లేని హాస్పిటల్ లో సర్జరీలు చేయడం పొరపాటేనని, మామూలు కోర్సులు చేసి ఎంబిబిఎస్ డాక్టర్ల వైద్యం చేయడం ముమ్మాటికి తప్పే..! త్వరలోనే పూర్తి మొత్తంలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం.
రిజిస్ట్రేషన్ లేని హాస్పిటల్లో బిల్లులకి సీ.ఎమ్.ఆర్.ఎఫ్ పొందేది ఎలా..?
సామాన్యంగా ఆరోగ్యశ్రీలో వర్తించని ట్రీట్మెంట్ కి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందే పలువురు సీఎంఆర్ఆఫ్ లో బిల్లులు పెట్టి కాస్తో కూస్తో ఊరటగా ప్రభుత్వం నుండి డబ్బులు లభిస్తుంది. అయితే రిజిస్ట్రేషన్ లేని ఇలాంటి ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకొని డబ్బులు చెల్లించిన… ప్రభుత్వం నుండి వచ్చే సిఎంఆర్ఆఫ్ కి మాత్రం అనార్హతగా ఉంటుంది.




