.మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 11బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళ విద్య కోసం పాటుపడిన జ్యోతిబాపూలే అందరికీ ఆదర్శప్రాయుడని తెలంగాణ తెలుగుదేశం పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షులు కంది కంటి అశోక్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.జ్యోతిబా పూలే 197వ జయంతి సందర్భంగా సైనిక్ పురి లోని జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.సమాజంలో కుల వ్యతిరేక సమాజాన్ని స్థాపించడానికి కృషి చేశారని ఆయన జీవితం లోని ఆశయాలు అన్ని కూడా మనకు ఆదర్శప్రాయలని ప్రతి ఒక్కరూ బాపు లేను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు టిజికె మూర్తి,ఒగ్గు చంద్రశేఖరావు,కరణం గోపి, భీమ్ రాజ్,భిక్షపతి గౌడ్,సాంబమూర్తి గౌడ్,కొమురయ్య,ప్రకాష్,లక్ష్మణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు




