Wednesday, 4 November 2026

చైనా హార్బర్‌లో భారీ పేలుడు…17 మంది దుర్మరణం

చైనా హార్బర్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా, 400 మందికి పైగా గాయపడినట్లు సమాచారం అందింది. ఉత్తర చైనాలోని తియాంజిన్ నగరంలో హార్బర్ ఉంది. ఇందులో కెమికల్, గూట్స్ ఉన్న ప్రాంతంలో బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో అకస్మాత్తుగా ఒక భారీ పేలుడు సంభవించింది. ఆ తర్వాత రెండు నిమిషాల వ్యవధిలో మరో భారీ పేలుడు ఏర్పడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. 

ఈ పేలుళ్లతో అక్కడ ఉన్న వందలాది మంది కార్మికులు గాయపడ్డారు. వారిని రెక్స్యూ టీమ్ ఆస్పత్రికి తరలించారు. ఈ భారీ పేలుళ్లు అక్కడి నుంచి సుమారు రెండు కిలో మీటర్ల దూరానికి వినిపించినట్టు సమాచారం. అయితే పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది.

కాగా గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉండడంతో మృతల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఇంత పెద్ద విస్పోటన ఇంతకు ముందు ఎన్నడూ ఆ ప్రాంతంలో జరగలేదని అధికారులు తెలుపుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *