Thursday, 5 November 2026

పట్టణంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పట్టణంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హుజూర్ నగర్ డిసెంబర్ 28 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఇందిరా భవన్లో కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్లగొండ పార్లమెంటు సభ్యులు కెప్టెన్ నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ జెండానీ ఎగరవేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకుల మధ్య భారీ కేకును కట్ చేశారు. బుధవారం ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏఓ హ్యమ్, నాయకత్వాన పురుడు పోసుకున్న కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహుదూర్ శాస్త్రి, సరోజినీ నాయుడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, ఇందిరా గాంధీ లాంటి ఎందరో గొప్ప నాయకులు పార్టీ నిర్మాణంలో వారి యొక్క జీవితాలను త్యాగం చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చే విషయంలో ఎన్నో పోరాటాలు కనపర్చారన్నారు. దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, సోనియాగాంధీ నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైందని, అటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి పార్టీలో ఉండటం చాలా గొప్ప విషయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగన్న గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జునరావు, ఈడుపుగంటి సుబ్బారావు, అల్లం ప్రభాకర్ రెడ్డి, ఎండి.అజీజ్ పాషా, గల్లా వెంకటేశ్వర్లు, జక్కుల మల్లయ్య, కోతి సంపత్ రెడ్డి, బాచిమంచి గిరిబాబు, కోల్లపూడి యోహాన్, జింజిరాల సైదులు, దొంతగాని జగన్, మహేష్, ముక్కంటి, వీరబాబు, మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.