Tuesday, 3 November 2026

చైన్ స్నాచర్ దాడిలో పసికందు మృతి

 88హైదరాబాద్ : నగరంలో మళ్లీ ఛైన్ స్నాచర్లు పంజా విసురుతున్నారు. తాజాగా ఛైన్ స్నాచర్ల ఆగడాలకు ఓ పసికందు బలైంది. ఈ ఘటన నేరెడ్ మెట్ లో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ఓ మహిళ ఆర్కేపురం వద్ద నడుచుకుంటూ వెళుతోంది. వెనుక నుండి ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తు తెలియని దుండగులు మహిళ మెడలో ఉన్న గొలుసును తెంపే ప్రయత్నం చేశారు. మహిళ పెనుగులాడింది. ఈ సమయంలో మహిళ ఒడిలో ఉన్న 25 రోజుల పసికందు పడిపోయింది. అనంతరం దుండగులు మూడు తలాల గొలుసు లాక్కెళ్లారు. తీవ్రగాయాలపాలైన పసికందును గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాపీ అప్పటికే ఆ పసికందు అనంతలోకాలకి వెళ్లిపోయింది. కళ్లెదుటే పసికందు మృతి చెందడంతో ఆ తల్లి రోదన వర్ణనాతీతంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీ టివి ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకొనేందుకు రెండు బృందాలు గాలింపులు చేపడుతున్నాయి.

ఛైన్ స్నాచర్లకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వారు మాత్రం విజృంభిస్తునే ఉన్నారు. ఛైన్ స్నాచర్ల ఆగడాలకు పలువురు మృతి చెందడమే కాకుండా గాయాలపాలవుతున్నారు. దీనితో నగర పోలీసులు యాంటీ స్నాచింగ్ టీం ఏర్పాటు చేసింది. ఛైన్ స్నాచర్లను పట్టుకొనే ప్రయత్నంలో కాల్పులు చేసే అనుమతి ఈ టీంకు ఉంది. వనస్థలిపురంలో ఇలాగే ఓ ఘటనలో పోలీసులు కాల్పులు జరిపినా స్నాచర్లు పరారయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *