భిఎస్పి జిల్లా అధ్యక్షులు పృధ్వీరాజ్…
నాగర్ కర్నూల్ ఆర్సీ జూలై 6(జనంసాక్షి):బహుజన సమాజ్ పార్టీ(BSP) ఆధ్వర్యంలో జిల్లా DWOకు వినతి పత్రం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్ మాట్లాడుతూ,చైల్డ్ హెల్ప్ లైన్ 109 పోస్ట్ భర్తీలలో అవక తవకాలు జరిగాయని ఆరోపించారు.విద్యార్థత,కంప్యూటర్ స్కిల్స్,స్థానికత,అనుభవం,ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్,గతంలో పనిచేసిన అనుభవం,రోస్టర్ ఆధారంగా ఇవ్వాల్సిన ఉద్యోగాలను అధికార పార్టీ కనుసన్నుల్లో ఉండే వారికి ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు.ఈమాత్రం దానికి నోటిికేషన్లు,ఇంటర్వ్యూలు ఎందుకని ప్రశ్నించారు.ఇట్టి నియామకాలపై తక్షణమే విచారణ జరిపి అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో పెద్ద ఎత్తున్న కలెక్టర్ ఛాంబర్ ఎదుట బిఎస్పీ పార్టీ ఆద్వర్యంలో ఆందోళన కార్య్రమాలు చేపడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్,అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కళ్యాణ్,ఉద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు.




