Thursday, 5 November 2026

చొప్పదండి నియోజకవడ్ల కొనుగోలు

చొప్పదండి నియోజకవడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించినవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం

బోయిన్ పల్లి నంబర్ 12 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించిన చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం. వడ్ల కొనుగోలు కేంద్రం పరిశీలించిన అనంతరం మేడిపల్లి సత్యం మాట్లాడుతూ రాష్ట్రంలో వరి కోతలు ప్రారంభమై రెండు నెలలు అవుతున్న ఇంకా ప్రారంభం కానీ ఐకెపి కొనుగోలు కేంద్రాలు కేంద్రాల ఏర్పాటు లో అధికార యంత్రాంగం, నిర్లక్ష్యం జిల్లాలో అక్కడక్కడ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన అధికారులు మిల్లర్లు కుమ్మక్కై రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు,తాలు తప్ప పేరిట నలభై కేజీల బస్తాకు కేజీ నుంచి మూడు కేజీల వరకు ధాన్యం కట్ చేస్తున్నారని అన్నారు సాక్షాత్త కేటిఆర్, గంగుల కమలాకర్, మంత్రులు భ్యాదత వహిస్తున్న జిల్లాలు ఎఫ్ సి ఐ నిబంధనల మేరకు ధాన్యం తూకం వేస్తున్న ధాన్యం దించుకునేందుకు మిల్లర్లు నాన కొర్రీలు పెడుతున్నారు
దీంతో రైతులు గత్యంతనం లేక బస్తాకు కేజీ నుంచి మూడు కేజీల వరకు అదనంగా ఇవ్వాల్సి వస్తుందని అన్నారు
దీంతో రైతులు 10 నుంచి 15 వేల రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని ఐకెపి కేంద్రాల నిర్వాహకులు మిల్లర్లు కుమ్మక్కై రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు
ఇలా ప్రతి సంవత్సరం రెండు సీజన్లో కలిపి వేల కోట్లు రైతుల నుంచి దోచుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఐకెపి కేంద్రాల నిర్వాహకులు మిల్లర్ల దోపిడి పై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని సూచించారు ప్రతి సీజన్లో రైతుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు
సివిల్ సప్లై మినిస్టర్ మిల్లర్లు ఐకెపి కేంద్రాల అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో: రాజన్న సిరిసిల్ల బిసి సెల్ చైర్మన్ కూస రవీందర్, బోయినిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీంరెడ్డి మహేశ్వర్ రెడ్డి, తడగొండ ఎంపీటీసి ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, బోయినిపల్లి మండల మాజీ జడ్పీటిస్ పులి లక్ష్మిపతి గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండీ మహ్మద్, గంగిపల్లి లచ్చయ్య, గుడి శేఖర్ రెడ్డి, జాగీరి వెంకటేష్, కోల ప్రభాకర్, యువజన కాంగ్రెస్ నాయకులు ఆకుల అజయ్, రైతులు ఉన్నారు.