బెల్లంపల్లి, మే 17,( జనంసాక్షి )బెల్లంపల్లి డివిజన్లో చౌకధరల దుకాణముల డీలర్షిప్ ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుబెల్లంపల్లి ఆర్డివో శ్యామలాదేవి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీలర్షిప్ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, బెల్లంపల్లి మండలంలోని షాప్ నెం 3201031- అశోక్ నగర్ వార్డు నం. 19, 20 (జనరల్ కేటగిరీ), 3201006– మాల గురిజాల (ఎస్సి జనరల్ ), భీమిని మండలంలోని 3203014- కేస్లాపూర్ (ఎస్టీ మహిళ), 3203004 – రాంపూర్ (ఎస్సి జనరల్ ), 3203008 – వీగాం (ఎస్టీ జనరల్), కాసిపేట మండలంలోని 3208003- ముత్యంపల్లి (బిసి బి), కన్నెపల్లి మండలంలోని 3220010- పోలంపల్లి (ఎస్టీ మహిళ), 3220003 – టేకులపల్లి (జనరల్ మహిళ), నెన్నెల మండలంలోని 3221008 – చిత్తాపూర్ (జనరల్ మహిళ), తాండూర్ మండలంలోని 3215010 – బోయపల్లి (ఎస్టీ మహిళ), 3215009 – చౌటపల్లి (జనరల్ కేటగిరీ), 3215013 – రేచిని (జనరల్ కేటగిరీ), 3215007 – ద్వారకాపూర్ (జనరల్ మహిళ), 3215012 – అచ్చలాపూర్ (ఎస్సి జనరల్) ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఈ నెల 15 నుండి 31వ తేదీ వరకు కార్యాలయపు పని వేళలలో దరఖాస్తులను బెల్లంపల్లి ఆర్డివో కార్యాలయంలో దాఖలు చేయాలని, దరఖాస్తు గుర్తింపు నిమిత్తం 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలను అతికించి సంబంధిత తహశిల్దార్ సంతకంతో ధృవీకరింపవలసి ఉంటుందని, దరఖాస్తు వెంట నివాసము, కులము, పుట్టిన తేదీ, విద్యార్హత, సంబంధిత పత్రాలను జతపరచాలని తెలిపారు. అర్హత, రిజర్వేషన్, విద్యార్హత, గత చరిత్ర పరిశీలన, వయోపరిమితి, నివాసం, ప్రాధాన్యత అంశాలను పరిశీలించడం జరుగుతుందని, వ్రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులు మౌఖిక ఇంటర్వ్యూకు అర్హులని తెలిపారు. దరఖాస్తు సంబంధిత పూర్తి వివరాలు ఆర్డివో కార్యాలయంలో నోటీసు బోర్డులో ఉంచడం జరిగిందని, ఆసక్తి, అర్హత గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.




