Wednesday, 4 November 2026

‘ఛల్లో అసెంబ్లీ’ నిర్వహించి తీరుతాం : శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌: ప్రభుత్వం ఎన్ని నిర్భందాలు పెట్టిన ఈనెల 14న తలపెట్టిన ‘ఛలో అసెంబ్లీ’ నిర్వహించి తీరుతామని తెలంగాణ రాజకీయ ఐకాస నేత శ్రీనివాస్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. ఛలో అసెంబ్లీ విజయవంతం చేసేందుకు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులతో ఆయన హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదన్న విషయాన్ని తెలుసుకోవాని ప్రభుత్వానికి హితవు పలికారు. ఉద్యోగులపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తే జీహెచ్‌ఎంసీలోని అత్యవసర సేవలు బంద్‌ చేస్తామని శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *