హైదరాబాద్: ఛలో అసెంబ్లీ నేపధ్యంతో ముందస్తు అరెస్టులను నిలిపివేయాలని కోరుతూ తెరాస ఎమ్మెల్యేలు హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అనురాగ్ శర్మను కలిశారు. రాజకీయ ఐకాస ఇచ్చిన ఛలోఅసెంబ్లీ కార్యక్రమానికి రెండు రోజుల ముందే తమ నాయకులను కార్యక్తలను అక్రమ అరెస్టులు చేస్తున్నారని వారిని వెంటనే విడుదల చేయాలని తెరాస ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, నాయిని నర్శింహరెడ్డి సీపీని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తోందని ఎన్ని ఆటంకాలు సృష్టించినా మిలియన్ మార్చ్, సాగరహారాల తరహాలో ఛలో అసెంబ్లీ నిర్వహించిఆ తీరుతామని అన్నారు.




